close

బుధవారం, ఆగస్టు 05, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విద్యుదాఘాతానికి ఎలక్ట్రీషియన్‌ మృతి

వేటపాలెం, న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌ మృతిచెందాడు. ఈ సంఘటన చల్లారెడ్డిపాలెం పంచాయతీ కొణిజేటి చేనేతపురి కాలనీ సమీపంలో శనివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... చేనేతపురి కాలనీలో ఉండే పముజుల రమేష్‌(45) కొత్తకాలువ గట్టుపై ఉన్న విద్యుత్తు స్తంభానికి ఇన్సులేటర్‌ బిగిస్తున్నారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు వ్యవసాయ లైను విద్యుత్తు తీగ తగిలి మృతిచెందాడు. సంఘటనాస్థలాన్ని వేటపాలెం పోలీసుస్టేషన్‌ రైటర్‌ అరుణ్‌ సందర్శించారు. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

వడ్డెపాలెంలో...

పీసీపల్లి: విద్యుదాఘాతంతో బాలిక మృతి చెందిన సంఘటన పీసీపల్లి మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... వడ్డెపాలేనికి చెందిన బత్తుల రమణమ్మ, వేణు దంపతుల కుమార్తె గంగాభవాని(14). శనివారం దుస్తులు ఉతికి ఇంటి ముందున్న పందిరిపై ఆరేస్తుండగా- ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగ తగిలింది. అపస్మాకర స్థితికి చేరుకున్న బాలికను కుటుంబ సభ్యులు కనిగిరి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా- మార్గం మధ్యలో మృతి చెందారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై మధుసూదన్‌రావు తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.