close
Published : 25/10/2020 03:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒంగోలు టు తమిళనాడు

● గూడ్స్‌ రైలులో తొలిసారిగా మొక్కజొన్న రవాణా

మొక్కజొన్న బస్తాలను లారీ నుంచి రైలు వ్యాగన్‌లోకి ఎక్కిస్తున్న కార్మికులు

ఒంగోలు ట్రరకు రోడ్డు, న్యూస్‌టుడే: జిల్లా నుంచి తొలిసారిగా మొక్కజొన్న సరకుతో గూడ్స్‌ రైలు స్థానిక స్టేషన్‌ నుంచి తమిళనాడు రాష్ట్రం చావాదిపాళ్యేనికి శనివారం బయల్దేరి వెళ్లింది. కేవలం ఒంగోలు సెక్షన్‌ నుంచే కాదు, విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలోనే మొక్కజొన్నను ఇలా రవాణా చేయడం ఇదే ప్రథమం. సరకు రవాణా ద్వారా ఆదాయాన్ని పెంచుకునే మార్గాల అన్వేషణలో భాగంగా విజయవాడ డివిజన్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ యూనిట్‌(బీడీయూ)ను ఏర్పాటు చేసింది. ఇది ఒంగోలు సెక్షన్లో క్షేత్రస్థాయిలో పలువురితో సంప్రదింపులు జరిపి రైలు ద్వారా సరకు రవాణా సులువైన, చవకైన మార్గంగా వ్యాపారుల్లో నమ్మకం కలిగించింది. దీంతో ఏలూరుకు చెందిన ఓ సంస్థ గూడ్స్‌ ద్వారా మొక్కజొన్న రవాణాకు ముందుకు రాగా 21 వ్యాగన్లలో 1,323 టన్నులను చేరవేసి రైల్వే శాఖ రూ.11.73 లక్షలు ఆర్జించింది. మరో 17 వేల టన్నుల రవాణాకు సైతం సదరు సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ పి.శ్రీనివాస్‌ తెలిపారు. టన్ను సరకు గూడ్స్‌ రైళ్ల ద్వారా 650 కి.మీ.కి చేర్చాలంటే రూ.886, రోడ్డు మార్గమైతే రూ.1,550 అవుతుందన్నారు. ఒంగోలు సెక్షన్‌ ద్వారా ఇప్పటి వరకు శనగల రవాణాపై రూ.80.17 లక్షలు ఆర్జించామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.