
ప్ఛ్. మూతులకందని మాస్కులు
మాస్కు చాలడం లేదని చూపుతున్న ఓ బాలిక
కరోనా నుంచి కాపాడుకునేందుకు రక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మాస్కులు సరఫరా చేసింది. ఒక్కో విద్యార్ధికి రెండు చొప్పున అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల మాస్కులను తయారు చేయించి అన్ని మండలాలకూ వీటిని సరఫరా చేశారు. తాళ్లూరు ప్రాంతానికి పంపించిన మాస్కులు చిన్నవిగా ఉన్నాయి. దీంతో పాఠశాలల విద్యార్థులు వీటిని ధరించేందుకు ఇబ్బంది పడుతున్నారు. నోరు, ముక్కులకు అడ్డుగా ఉండేలా మాస్కులను ధరించాల్సి ఉంటుంది. అయితే చిన్నవిగా ఉన్నందున విద్యార్థులు వీటిని ఉపయోగించడం లేదు. రెండు చెవులకు తగిలించేందుకు ప్రయత్నిస్తే చాలడం లేదని.. నోటి వరకే వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక బొద్దికూరపాడు ప్రాంతంలో వీటిని ఓ మూలన పడేశారు. - న్యూస్టుడే, తాళ్లూరు
Tags :