రూ.5 లక్షల విలువైన పట్టు స్వాధీనం
logo
Published : 25/06/2021 02:33 IST

రూ.5 లక్షల విలువైన పట్టు స్వాధీనం


స్వాధీనం చేసుకున్న పట్టుతో ఎస్సై కమలాకర్‌, సిబ్బంది

వేటపాలెం, న్యూస్‌టుడే: చీరల తయారీకి వినియోగించే పట్టును చోరీ చేసిన కేసులో నిందితులతో పాటు రూ.5 లక్షల విలువైన సొత్తును వేటపాలెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్టేషన్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఎస్సై కమలాకర్‌ వివరాలు వెల్లడించారు. చీరాల, వేటపాలెం మండలాల్లో ఇటీవల చోరీలు పెరగడంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు... డీఎస్సీ పి.శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో గ్రామీణ సీఐ రోశయ్య, ఎస్సైతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా దేశాయిపేటకు చెందిన బోడపాటి చండ్రరాజు ఇంటిలో గురువారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. రూ.5 లక్షల విలువ చేసే 163 కిలోల పట్టుతో పాటు రూ.25 వేల ఖరీదు చేసే సిగరెట్‌ పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడితో పాటు అక్కడే ఉన్న సలగల జాషువ, చేగోడి సునీల్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పట్టు ఆరు కేసులకు సంబంధించినదని తెలిపారు. నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినట్లు ఎస్సై తెలిపారు. చాకచక్యంగా కేసు ఛేదించిన ఎస్సై కమలాకర్‌తో పాటు కానిస్టేబుళ్లు తన్నీరు శ్రీను, అచ్చయ్య, ఎండీ కాశీం, వెంకటేశ్వర్లు, రవి, అలెగ్జాండర్‌, హోంగార్డ్‌ నారపరెడ్డిని జిల్లా ఎస్పీ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని