కోడలితో వివాహేతర సంబంధం.. ఆమెతో కలిసి కుమారుడిని చంపిన తండ్రి
eenadu telugu news
Updated : 03/08/2021 09:10 IST

కోడలితో వివాహేతర సంబంధం.. ఆమెతో కలిసి కుమారుడిని చంపిన తండ్రి

సంతమాగులూరు, న్యూస్‌టుడే: కోడలితో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించాడా తండ్రి. ఆమెతో కలిసి కుమారుడిని హత్యచేశాడు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలో ఈ దారుణం చోటుచేసుకుంది. అద్దంకి సీఐ రాజేష్‌, ఎస్సై వి.శివన్నారాయణ తెలిపిన వివరాల ప్రకారం... ఏల్చూరు ఎస్సీ కాలనీకి కరుణయ్య, మరియమ్మ భార్యాభర్తలు. వీరి కుమారుడు లక్ష్మయ్య (35)కు గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన సునీతకు పద్దెనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు మగ పిల్లలున్నారు. మరియమ్మ ముప్పై ఏళ్ల క్రితమే చనిపోయారు. లక్ష్మయ్య మద్యానికి బానిసై ఆ మత్తులో ఉండేవాడు. ఈ క్రమంలో మామ కరుణయ్య, కోడలు సునీతకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని లక్ష్మయ్యను హత్య చేసేందుకు వారు కుట్ర పన్నారు. వేసిన పథకం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక... గాఢనిద్రలో ఉన్న లక్ష్మయ్యపై మారణాయుధాలతో దాడి చేసి చంపారు. ఈ దారుణాన్ని కళ్లారా చూసిన మృతుడి పెద్ద కుమారుడి వల్ల విషయం బహిర్గతమైంది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని