తితిదే పాలకమండలి సభ్యుడిగా సేవలందిస్తా
eenadu telugu news
Published : 16/09/2021 05:47 IST

తితిదే పాలకమండలి సభ్యుడిగా సేవలందిస్తా

 కనిగిరి శాసనసభ్యుడు మధుసూదన్‌యాదవ్‌

కనిగిరి, న్యూస్‌టుడే: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో సభ్యుడిగా కనిగిరి శాసనసభ్యుడు బుర్రా మధుసూదన్‌యాదవ్‌కు అవకాశం రావడంతో నియోజకవర్గంలో సందడి నెలకొంది. బుధవారం రాత్రి వైకాపా శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఈ సందర్భంగా ‘న్యూస్‌టుడే’తో మధుసూదన్‌యాదవ్‌ మాట్లాడుతూ కటిక పేదరికం నుంచి వచ్చిన తాను బేల్దారీ మేస్త్రిగా జీవితాన్ని ఆరంభించినట్లు తెలిపారు. తనను నమ్మి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కనిగిరి వైకాపా అభ్యర్థిగా రెండు దఫాలు అవకాశం కల్పించారన్నారు. తొలిసారి ఓటమి పాలైనా తిరిగి రెండోసారి శాసనసభ్యుడిగా విజయం సాధించానన్నారు. ప్రస్తుతం తిరుమల వేంకటేశ్వరస్వామి సేవ చేసుకునేందుకు ముఖ్యమంత్రి అవకాశం కల్పించారన్నారు. పాలకమండలి సభ్యుడిగా తనవంతు సేవలందిస్తానన్నారు. అలాగే కనిగిరి ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ సందర్భంగా తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సుబ్బారెడ్డిని సత్కరించారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని