డిగ్రీ కళాశాల అధ్యాపకులకు బదిలీలు
eenadu telugu news
Published : 16/09/2021 05:47 IST

డిగ్రీ కళాశాల అధ్యాపకులకు బదిలీలు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల బదిలీలకు సంబంధించి జీవో విడుదల చేశారు. ఈనెలాఖరు లోపు సీనియారిటీ జాబితాలు తయారు చేసి కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంది. ఈమేరకు జిల్లా నోడల్‌ అధికారి, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌కు సమాచారం అందింది. ప్రస్తుతం పనిచేస్తున్న చోట రెండేళ్లు నిండినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయిదేళ్లు పూర్తయిన వారు తప్పనిసరిగా బదిలీ అవుతారు. 2023 జూన్‌ 30 లోపు ఉద్యోగ విరమణ చేసేవారికి బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఎయిడెడ్‌ విద్యాలయాలపై సమీక్ష
ఏఎన్‌యూ: ఎయిడెడ్‌ కళాశాలల సిబ్బందిని ప్రభుత్వ పరిధిలోకి తీసుకున్న నేపథ్యంలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల కళాశాలల యాజమాన్యాలతో సాంకేతిక విద్యా కమిషనర్‌ పోలా భాస్కర్‌ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఏఎన్‌యూలోని డైక్‌మెన్‌ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఏడు జిల్లాల్లోని కళాశాలల యాజమాన్య ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ‘రిలీవింగ్‌ ఆర్డర్‌’ ఇవ్వాలంటూ సమావేశం బయట డాక్టా సభ్యులు ఆందోళన నిర్వహించారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని