గుంటుపల్లి ఆసుపత్రి పరిశీలన
eenadu telugu news
Published : 16/09/2021 05:47 IST

గుంటుపల్లి ఆసుపత్రి పరిశీలన


వైద్యులకు సూచనలు చేస్తున్న కేంద్ర వైద్య బృందం సభ్యుడు కార్తీక్‌

బల్లికురవ, న్యూస్‌టుడే: కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం గుంటుపల్లి ప్రభుత్వ వైద్యశాలను బుధవారం సందర్శించింది. ప్రజలకు అందుతున్న వైద్య సేవల వివరాలను సభ్యులు సేకరించారు. రోగులతో మాట్లాడి వారికి అందజేస్తున్న మందులు, కల్పిస్తున్న వసతులు తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. సేకరించిన వివరాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు. దిల్లీ, కేరళ రాష్ట్రాలకు చెందిన వైద్యులు కార్తీక్‌, ఏంజెలియాతో పాటు స్థానిక వైద్యులు భానుప్రకాశ్‌, అమీర్‌ ఆలీ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని