‘రైతు కోసం తెలుగుదేశం’ విజయవంతానికి వినతి
eenadu telugu news
Published : 16/09/2021 05:47 IST

‘రైతు కోసం తెలుగుదేశం’ విజయవంతానికి వినతి


పంగులూరు: సమావేశంలో మాట్లాడుతున్న సుబ్బారావు

మార్టూరు, న్యూస్‌టుడే: రైతాంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ నెల 18న చేపట్టనున్న రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ బాపట్ల పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు తొండెపు ఆదినారాయణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇసుకదర్శిలోని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నాయకులు పాల్గొన్నారు. పంగులూరు: ముప్పవరంలో నిర్వహించిన కార్యక్రమంలో తెదేపా పంగులూరు మండల అధ్యక్షుడు రావురి రమేష్‌, నాయకులు కరి సుబ్బారావు మాట్లాడారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమానికి అద్దంకి నియోజకవర్గంలోని నాయకులంతా తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో కుక్కపల్లి ఏడుకొండలు, అల్లంనేని బ్రహ్మానందం, గొట్టిపాటి ఖాజా, ఉన్నం రవి, గుర్రం శేఖర్‌ పాల్గొన్నారు.

చినగంజాం: రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వైకాపా ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆసోది సుబ్బారెడ్డి అన్నారు. చినగంజాం పార్టీ కార్యాలయంలో మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ అబ్దుల్‌ కలామ్‌ ఆజాద్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. శనివారం నిర్వహించనున్న రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నాయకులు రాయని ఆత్మారావు, చెరుకూరి రాఘవయ్య, పర్వతరెడ్డి పార్థసారథి, శిఖరం వెంకటేశ్వర్లు, కె.మల్లికార్జునరెడ్డి, ఎన్‌.రాములు, బెల్లంకొండ రమేష్‌, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని