బాలిక అదృశ్యం విషాదాంతం
eenadu telugu news
Updated : 16/09/2021 13:29 IST

బాలిక అదృశ్యం విషాదాంతం

మోసం చేసిన యువకుడిని శిక్షించాలని ధర్నా


రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న బాలిక కుటుంబసభ్యులు, బంధువులు

కొమరోలు గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని బాదినేనిపల్లెలో ఈ నెల 13 రాత్రి నుంచి ఓ బాలిక(16) కనిపించని విషయం విధితమే. తలపోటుగా ఉందని బయటకు వెళ్లిన ఆమె ఆచూకీ తెలియక కుటుంబసభ్యులు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బుధవారం గ్రామ సమీపంలోని పులివాగులో ఆమె శవం లభ్యమైంది. ఎస్సై సాంబశివయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు వైద్యశాలకు తరలించారు. అయితే మండలంలోని రెడ్డిచర్లకు చెందిన బందెల జయచంద్రబాబు ఆమెను ప్రేమించి హత్య చేశాడని ఆరోపిస్తూ కుటుంబసభ్యులు, బంధువులు సాయంత్రం కొమరోలులోని నాలుగు రోడ్ల కూడలిలో మూడు గంటల పాటు నిరసన తెలిపారు. బాలిక మృతికి కారణమైన యువకుడిని శిక్షించాలని నినాదాలు చేశారు. ఎస్సైలు సాంబశివయ్య, బ్రహ్మనాయుడు వచ్చి సర్ది చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వారు వినలేదు. దీంతో సీఐ ఫిరోజ్‌ వచ్చి మాట్లాడారు. విచారణ చేసి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. నిందితుడు జయచంద్రబాబును అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. అతడిని విచారణ చేసి, పోస్టుమార్టం నివేదికను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని