తెదేపా పాపాల ఫలితమే విద్యుత్తు బిల్లుల పెంపు
eenadu telugu news
Published : 16/09/2021 05:47 IST

తెదేపా పాపాల ఫలితమే విద్యుత్తు బిల్లుల పెంపు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: తెదేపా ప్రభుత్వ హయాంలో చేసిన పాపాల వల్లనే ఇప్పుడు విద్యుత్తు బిల్లులు పెంచాల్సి వస్తుందని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం భవన్‌ వద్ద బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ట్రూ అప్‌ ఛార్జీలను వినియోగదారులు 7, 8 నెలలు భరించాల్సి ఉంటుందన్నారు. వైకాపా ప్రభుత్వం అయిదుసార్లు ఛార్జీలు పెంచిందని తెదేపా నేతలు అంటున్నారని.. ఎప్పుడు పెంచామని ప్రశ్నించారు. అబద్దాలకైనా హద్దులు ఉండాలన్నారు. ట్రూ అప్‌ ఛార్జీల వల్ల అద్దె ఇళ్లలో ఉంటున్నవారికి వచ్చే ఇబ్బందులపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఈ ఛార్జీల కింద రైతులు చెల్లించాల్సిన సుమారు రూ.900 కోట్ల నిధులను ప్రభుత్వమే భరించినట్లు పేర్కొన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పి.విశ్వరూప్‌, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌లు మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్టు పనులను 2022 ఆగస్టు కల్లా పూర్తిచేస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను గెజిట్‌లో చేర్చే విషయమై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్రానికి లేఖ రాయడం జరిగిందని.. త్వరలోనే ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుందని తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని