ఎస్‌పీఎంలకు ఆగమేఘాలపై రాగి తీగ సరఫరా
eenadu telugu news
Published : 16/09/2021 05:47 IST

ఎస్‌పీఎంలకు ఆగమేఘాలపై రాగి తీగ సరఫరా


గిద్దలూరు ఎస్‌పీఏం కేంద్రానికి సరఫరా చేసిన రాగి తీగ 

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే : ‘పరివర్తకం పాడైందా... గోవిందా’ శీర్షికన బుధవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి విద్యుత్తు శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. జిల్లాలో కాలిపోయి మరమ్మతులు చేపట్టాల్సిన పరివర్తకాలు ఎన్ని ఉన్నాయి .. వాటి అవసరాలు ఏమిటి తదితర వివరాలపై ఆరాతీశారు. ఆగమేఘాల మీద ఎస్‌పీఏం కేంద్రాలకు బుధవారం మధ్యాహ్నానికి రాగి తీగను సరఫరా చేశారు. గిద్దలూరులోని ఎస్‌పీఎం కేంద్రానికి 30 పరివర్తకాలకు సరిపోయే రాగి తీగను ప్రత్యేక వాహనం ద్వారా తీసుకొచ్చారు. కాలిపోయిన పరివర్తకాలకు మరమ్మతులు చేపట్టి త్వరితగతిన రైతుల పొలాల్లో ఏర్పాటు పూర్తి చేయాలని సీఏండీ టెలీకాన్ఫరెన్స్‌లో ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. 
రెండు వారాలు పట్టే అవకాశం
ఒక్కో ఎస్‌పీఏం కేంద్రంలో రోజుకు రెండు పరివర్తకాల కంటే ఎక్కువ వాటికి మరమ్మతులు చేపట్టే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఇప్పటికే మార్కాపురం డివిజన్‌ పరిధిలో పలు కాలిపోయిన పరివర్తకాలు ఉండటంతో వాటికి మరమ్మతులు చేపట్టాలంటే కనీసం రెండు వారాల సమయం పట్టొచ్చని భావిస్తున్నారు. ఆ లోపు రైతులు సాగుచేసిన పొలాల్లో పంటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదముంది. ఇప్పటికైనా విద్యుత్తుశాఖ ఉన్నతాధికారులు, జిల్లా మంత్రి చొరవ తీసుకొని జిల్లా స్టోర్స్‌లో నిల్వ ఉండే పరివర్తకాలను కాలిపోయిన పరివర్తకాల స్థానంలో వెంటనే అమర్చేలా చొరవ తీసుకోవాలని వారు కోరుతున్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని