చిట్టీల నిర్వాహకులపై బిగిసిన ఉచ్చు
eenadu telugu news
Published : 16/09/2021 05:47 IST

చిట్టీల నిర్వాహకులపై బిగిసిన ఉచ్చు

ఇంకొల్లు, న్యూస్‌టుడే: చిట్టీల పేరిట మోసం చేసిన కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఇంకొల్లు పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మార్కాపురం ఓఎస్డీ చౌడేశ్వరి ఈ వివరాలు వెల్లడించారు. చినగంజాం మండలం, సోపిరాలకు చెందిన పోలకం ఝాన్సీలక్ష్మి మరికొందరి సహకారంతో అనుమతులు లేకుండా చిట్టీలు నిర్వహించారు. సోపిరాల, పరిసర ప్రాంతాలకు చెందిన  73 మంది నుంచి రూ.2.70 కోట్లను వసూలు చేశారు. పాడిన చిట్టీలకు సంబంధించిన నగదును కూడా ఇవ్వకపోవడం .. కూడగట్టిన డబ్బులతో ఆస్తులను కొనుగోలు చేయడంపై ఇటీవల సోపిరాలకు చెందిన బాధితురాలు కుర్రి రాధ, మరో 72 మంది ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. దీనిపై ఎస్పీ మలికా గార్గ్‌ స్పందించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో వారు రంగంలోకి దిగారు.   నిందితురాలు పోలకం ఝాన్సీలక్ష్మి, కుమారుడు పోలకం వెంకట కృష్ణారావు, కుమార్తె లక్కాకుల కవితలను బుధవారం చినగంజాంలో అరెస్టు చేశారు. కార్యక్రమంలో ఇంకొల్లు, చినగంజాం ఎస్సైలు ప్రసాద్, పి.అంకమ్మరావు పాల్గొన్నారు. 
వారం రోజులుగా...: ఝాన్సీలక్ష్మి నుంచి మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించిన వెంటనే మార్కాపురం ఓఎస్డీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం దీనిపై దృష్టి సారించింది. చీరాల డీఎస్పీ శ్రీకాంత్, ఇంకొల్లు సీఐ సుబ్బారావు, డివిజన్‌ పరిధిలోని మరో అయిదుగురు ఎస్సైలు పూర్తిస్థాయిలో వారం రోజులుగా బాధితుల నుంచి వివరాలను సేకరించారు. ఈ మేరకు దాదాపు రూ. 2.7 కోట్లను అనుమతులు లేకుండా వసూలు చేసినట్లు విచారణలో తేలడంతో వారు నిందితులపై ఉచ్చు బిగించారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని