ఖాతాదారుల సహకారంతోనే అభివృద్ధి
eenadu telugu news
Published : 16/09/2021 05:47 IST

ఖాతాదారుల సహకారంతోనే అభివృద్ధి


మహిళకు చెక్కు అందజేస్తున్న ఏపీజీబీ ఛైర్మన్‌ రాకేష్‌

పామూరు, న్యూస్‌టుడే: ఖాతాదారుల సహకారంతోనే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు అన్ని ప్రాంతాల్లో దిగ్విజయంగా వ్యాపారం చేస్తోందని బ్యాంకు ఛైర్మన్‌ రాకేష్‌ కశ్యప్‌ తెలిపారు. పామూరు ఏపీజీబీలో బుధవారం జరిగిన ఖాతాదారుల సమావేశానికి ముఖ్య అతిధిగా ఆయన హాజరై మాట్లాడారు. ఈ ఏడాది మార్చి నాటికి రూ.36,639 కోట్ల వ్యాపారం జరిగిందన్నారు. పామూరు ఏపీజీబీ శాఖ అన్ని జిల్లాలో కంటే రుణాల మంజూరు, రికవరీలో ప్రథమ స్థానంలో ఉందని వివరించారు. బ్యాంకు మేనేజర్‌ పి.వెంకటేశ్వర్లును అభినందించారు. రుణాలు మంజూరు చేసిన ఖాతాదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేనేజర్లు పి.వెంకటేశ్వర్లు, పి.శ్రీనివాసులు, రాజశేఖర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని