ఆర్టీసీ బస్సుకు నిప్పంటించిన యువకుడు.. ప్రయాణికులు సురక్షితం
eenadu telugu news
Updated : 14/10/2021 15:32 IST

ఆర్టీసీ బస్సుకు నిప్పంటించిన యువకుడు.. ప్రయాణికులు సురక్షితం

కనిగిరి: ప్రయాణికులతో ఉన్న ఆర్టీసీ బస్సుకు ఓ యువకుడు నిప్పంటించాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెలిగండ్ల మండలం మొగులారుకు చెందిన రామగిరి ఏడుకొండలు అనే యువకుడు కనిగిరి పట్టణానికి వచ్చాడు. ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లిన ఏడుకొండలు.. ప్రయాణికులతో ఆగిఉన్న బస్సుపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో బస్సు, ప్రయాణికులకు ఎలాంటి నష్టం జరగలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఏడుకొండలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. యువకుడికి మానసిక స్థితి సరిగా లేదని గుర్తించారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని