ఆ సందడి నేడేదీ!
eenadu telugu news
Published : 15/10/2021 04:19 IST

ఆ సందడి నేడేదీ!

చీరాలలో కళ తప్పిన వస్త్ర వ్యాపారం

ఓ దుకాణంలో కొనుగోలుదారులు లేక...

చీరాల, న్యూస్‌టుడే: అంతటా దసరా వేడుకలు జరుగుతున్నాయి. సాధారణ రోజుల్లోనే కొనుగోలుదారులతో సందడిగా కనిపించే చీరాల వస్త్ర మార్కెట్‌లో ప్రస్తుతం పండగ రద్దీ కానరావడంలేదు. చాలావరకు దుకాణాలు బోసిపోతున్నాయి. చీరాలలో దాదాపు వెయ్యి వరకు వస్త్రదుకాణాలు ఉంటాయి. ఎంజీసీ, కామధేను మార్కెఫట్‌తోపాటు బెస్తపాలెం ప్రాంతం, ఆర్‌ఆర్‌రోడ్డు మొత్తం దుకాణాలకు నిలయం. అత్యంత ఖరీదైనవి మొదలు చౌకైన వస్త్రాలు కూడ అందుబాటులో ఉంటాయి. దీంతో చీరాల పరిసర ప్రాంతాల నుంచేకాకుండా రెండు తెలుగురాష్ట్రాల నుంచి కొనుగోలుదారులు ఇక్కడకి వస్తుంటారు.

70 శాతం పడిపోయిన అమ్మకాలు

గతంలో తెలంగాణ నుంచి పెద్దసంఖ్యలో కొనుగోలుదారులు వచ్చేవారు. ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టింది. ఆ తరువాత కరోనా ప్రభావం వ్యాపారంపై తీవ్రంగా పడింది. ప్రస్తుతం వస్త్రవ్యాపారానికి మంచి సీజన్‌. అయినా చాలా దుకాణాలు కొనుగోలుదారుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. గతంలో ఈ సీజన్‌లో రోజుకు దాదాపు రూ.10 కోట్ల వ్యాపారం జరిగేదని, ఇప్పుడు అది రూ.3 కోట్లు కూడా ఉండటం లేదని వ్యాపారులు అంటున్నారు. ఓ దుకాణదారు మాట్లాడుతూ ‘గతంలో భోజనం చేసేందుకు కూడా విరామం దొరికేదికాదు. ప్రస్తుతం పరిస్థితి దారుణంగా ఉంది. కొనుగోలుదారులు బాగా తగ్గిపోయారు. అద్దెలు, ఖర్చులు పెరిగిపోయాయి.’ అని తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని