త్వరలో పాఠశాల విద్యార్థులకు క్రీడా దుస్తులు
eenadu telugu news
Published : 15/10/2021 04:19 IST

త్వరలో పాఠశాల విద్యార్థులకు క్రీడా దుస్తులు

సభలో మాట్లాడుతున్న విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

త్రిపురాంతకం: పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్యా కానుక, నిఘంటువుతో పాటు త్వరలోనే క్రీడా దుస్తులు కూడా పంపిణీ చేయన్నుట్టు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. వైఎస్సార్‌ ఆసరా రెండో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని డీఆర్డీఏ పీడీ బాబూరావు అధ్యక్షతన గురువారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలోనే చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాల రూపంలో రూ. లక్షా ఇరవై వేల కోట్లు అందించినట్లు చెప్పారు. అందులో ఇప్పటి వరకు రూ.12 వేల కోట్లను ఆసరా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహయక సంఘాల మహిళలకు ఇచ్చినట్టు తెలిపారు. బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకొని రూ.32 కోట్లతో శానిటరీ నాప్‌కిన్స్‌ ఇచ్చేలా స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రారంభించామని వివరించారు. ఈ ఏడాది నుంచి హాజరు శాతాన్ని దృష్టిలో ఉంచుకొని 75 శాతం హాజరుతో అర్హులైన వారికి వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యే నాటికి అమ్మఒడి అందిస్తామని చెప్పారు. మహిళలకు ఆసరా నగదు చెక్కులతో పాటు, స్త్రీనిధి రుణాల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో క్లస్టర్‌ ఏరియా కో-ఆర్డినేటర్‌ లక్ష్మారెడ్డి, డీఎల్‌డీవో సాయికుమార్‌, ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు మాకం జాన్‌పాల్‌, ఏపీఎం కృపమ్మ, మాజీ ఎంపీపీ ఆంజనేయరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని