మాజీ ఎమ్మెల్యే పిచ్చిరెడ్డి మృతికి ప్రముఖుల నివాళి
eenadu telugu news
Published : 15/10/2021 04:19 IST

మాజీ ఎమ్మెల్యే పిచ్చిరెడ్డి మృతికి ప్రముఖుల నివాళి

పిచ్చిరెడ్డి భౌతికకాయం వద్ద నివాళులు అర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు

పొదిలి, దర్శి, న్యూస్‌టుడే: దర్శి మాజీ శాసనసభ్యుడు, వైకాపా సీనియర్‌ నాయకుడు సానికొమ్ము పిచ్చిరెడ్డి(77) బుధవారం అర్ధరాత్రి మృతి చెందారు. గురువారం ఆయన స్వగృహంలో భౌతికదేహాన్ని ప్రముఖులు సందర్శించారు. మార్కాపురం ఎమ్మెల్యే కె.పి.నాగార్జునరెడ్డి, దర్శి, మార్కాపురం, కంభం మాజీ ఎమ్మెల్యేలు నారపుశెట్టి పాపారావు, కె.పి.కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసులరెడ్డి, అద్దంకి మాజీ ఏఎంసీ ఛైర్మన్‌ వై.వి.భద్రారెడ్డి, పొదిలి, కంభం ఏఎంసీ ఛైర్మన్లు జి.కోటేశ్వరి శ్రీనివాసులు, వై.వెంకటేశ్వరరావు, ఏపీ స్టేట్‌ మైనింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కె.వి.రమణారెడ్డి, వైకాపా, తెదేపా, కాంగ్రెస్‌, సీపీఎం నాయకులు నివాళులు అర్పించారు. ప్రజా వైద్యునిగా, ఎమ్మెల్యేగా పొదిలి, దర్శి ప్రాంత ప్రజలకు విశేష సేవలందించారని కొనియాడారు. ప్రస్తుతం వైకాపాలో రాష్ట్ర నాయకుడిగా కొనసాగుతున్న ఆయన హయాంలోనే పొదిలిలో ఆర్టీసీ డిపో మంజూరైంది. ఆయనకు భార్య పద్మావతి, కుమార్తెలు బిందు, అపర్ణ, కుమారుడు శ్రీనివాసులరెడ్డి ఉన్నారు. కుమారుడు వైకాపా రాష్ట్ర నాయకుడిగా కొనసాగుతున్నారు. శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని