శాంతియుత వాతావరణంలో పండగ
eenadu telugu news
Published : 15/10/2021 04:19 IST

శాంతియుత వాతావరణంలో పండగ

మాట్లాడుతున్న సీఐ బి.టి.నాయక్‌

కంభం: పండగలను ఐకమత్యంతో నిర్వహించుకోవాలని మార్కాపురం సీఐ బి.టి.నాయక్‌ అన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో గురువారం పలు మతాలకు చెందిన వారితో శాంతి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 16న నిర్వహించే దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించే అమ్మవారి ఊరేగింపునకు అందరూ సహకరించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కలసికట్టుగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై నాగమల్లేశ్వరరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని