అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
eenadu telugu news
Published : 15/10/2021 04:19 IST

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

ఆసరా సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బలరామకృష్ణమూర్తి

చీరాల గ్రామీణం, న్యూస్‌టుడే: అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి పేర్కొన్నారు. చీరాల వీఆర్‌ఎస్‌, వైఆర్‌ఎన్‌ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించిన ఆసరా సదస్సులో ముఖ్య అతిథిగా మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి కార్యక్రమాలు సాగేలా చూస్తున్నామన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వెంటనే సరిదిద్దుతామన్నారు. ఉపాధి హామీ, ఆర్థిక సంఘం నిధులతో గ్రామాల్లో సీసీ రహదారులు నిర్మిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ ప్రత్యేకాధికారి చంద్రశేఖరరెడ్డి, వెలుగు జిల్లా ప్రోగామ్‌ అధికారి సుబ్బారావు, పురపాలక ఛైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు, దేవాంగ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బీరక సురేంద్ర, అర్బన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గవిని శ్రీనివాసరావు, ఎంపీడీవో సాంబశివరావు, తహసీల్దార్‌ మహ్మద్‌ హుస్సేన్‌... ఆసరా పథకం ప్రయోజనాలను వివరించారు. ముందుగా డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఆసరా రెండో విడత లబ్ధి చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా వాడరేవుకు చెందిన మహిళలు, చిన్నారులు ప్రదర్శించిన కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. వెలుగు ప్రాంతీయ సమన్వయకర్త అంబేడ్కర్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్‌ పాలేటి రామరావు, డాక్టర్‌ అమృతపాణి, పురపాలక వైస్‌ ఛైర్మన్‌ జైసన్‌బాబు, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వైష్ణవి, వెలుగు ఏపీఎంలు గద్దె సుబ్బారావు, బూదాటి శ్రీనివాసరావు, రైతు సలహా మండలి అధ్యక్షుడు రమణారెడ్డి, పీఏసీఎస్‌ అధ్యక్షుడు కేశవులు, నాయకులు నాదేండ్ల కోటేశ్వరరావు, బుర్ల మురళి, బిట్రా శ్రీను, షేక్‌ మస్తాన్‌, పి.ధనుంజయ్‌ పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని