బాధ్యతగా ‘భవనాశి’ పూర్తి చేయండి
eenadu telugu news
Published : 15/10/2021 04:19 IST

బాధ్యతగా ‘భవనాశి’ పూర్తి చేయండి

గోకనకొండ వద్ద ఆనకట్టను పరిశీలిస్తున్న రైతు సంఘం నాయకులు

మైలవరం (అద్దంకి), న్యూస్‌టుడే: జలయజ్ఞంలో భాగంగా శంకుస్థాపన చేసిన భవనాశి జలాశయాన్ని బాధ్యతగా పూర్తి చేయాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ.ప్రసాద్‌ అన్నారు. గుంటూరు జిల్లా గోకనకొండ వద్ద గుండ్లకమ్మ నదిపై నిర్మించిన ఆనకట్ట, భవనాశి జలాశయాన్ని సంఘం నాయకులతో కలిసి గురువారం పరిశీలించారు. 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు, పది గ్రామాల్లో భూగర్భ జలాల వృద్ధి, అద్దంకి పట్టణానికి మంచినీటి సదుపాయం లభిస్తుందన్న ఉద్దేశంతో... పుష్కరం క్రితం జలాశయం పనులు ప్రారంభించారన్నారు. పాలకులు మారుతున్నా నిర్మాణం మాత్రం పూర్తి కాలేదన్నారు. సీపీఐ పోరాటం... అప్పటి ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి చొరవతో 2016లో మరో రూ.20 కోట్లు సమకూరినా ప్రయోజనం లేపోయిందన్నారు. కాలువ నిర్మాణంలో ఉన్న ఆటంకాలను వెంటనే తొలగించాలని... భూసేకరణ పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ నాయకుడు గొల్లపూడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జలాశయం పనులు పూర్తి చేసి... జాగర్లమూడివారిపాలెం వద్ద పమిడిపాడు మేజరుకు అనుసంధానం చేయాలన్నారు. సంఘం జిల్లా కార్యదర్శి వడ్డె హనుమారెడ్డి మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టును దీర్ఘకాలం పెండింగ్‌లో ఉంచడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో చెన్నుపాటి సుబ్బారావు, కేఎల్‌డీ.ప్రసాద్‌, రైతు సత్యనారాయణ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని