పగలు వీధి దీపాలు వెలిగితే చర్యలు
eenadu telugu news
Published : 15/10/2021 04:19 IST

పగలు వీధి దీపాలు వెలిగితే చర్యలు

మాట్లాడుతున్న డీపీవో జీవీ నారాయణరెడ్డి

చినగంజాం, న్యూస్‌టుడే: ప్రజల ఆరోగ్యాలను కాపాడాల్సిన బాధ్యత పంచాయతీలపై ఉందని జిల్లా పంచాయతీ అధికారి జీవీ.నారాయణరెడ్డి అన్నారు. జగనన్న గృహ పథకం, స్వచ్ఛ సంకల్పం తదితర అంశాలపై ఎంపీడీవో డి.విజయలక్ష్మి అధ్యక్షతన చినగంజాం మండల సమావేశపు భవనంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీవో మాట్లాడుతూ... గ్రామాల్లోని వీధులను పరిశుభ్రంగా ఉంచాలని, లేకుంటే ఆయా పంచాయతీల సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. పగలు వీధి దీపాలు వెలగకుండా చూడాలని.. వెలుగుతున్నట్టు సమాచారం అందితే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు చేపడతామని హెచ్చరించారు. వీధి దీపాల పర్యవేక్షణ బాధ్యత పంచాయతీలకే వర్తిస్తుందని చెప్పారు. సమావేశంలో ఈవోఆర్డీ కె.స్వరూపరాణి, గృహ నిర్మాణ శాఖ ఏఈ రాజశేఖర్‌, 12 పంచాయతీలకు సంబంధించిన కార్యదర్శులు, డిజిటల్‌, వెల్పేర్‌ సహాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని