రెవెన్యూకు స్పందన బాగు
eenadu telugu news
Published : 22/10/2021 03:12 IST

రెవెన్యూకు స్పందన బాగు

పెళ్లూరు వార్డు సచివాలయంలో అర్జీదారుల సమస్యలు

తెలుసుకుంటున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ స్పందన కార్యక్రమాన్ని రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. 1,058 గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్జీల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. తొలిరోజైన గురువారం అర్జీదారుల నుంచి విశేష స్పందన లభించింది. మొత్తం 4,600 అర్జీలు వచ్చాయి. రెవెన్యూ డివిజన్ల వారీగా ఒంగోలులో 1,360; కందుకూరులో 1,871; మార్కాపురంలో 1,369 వినతులు వచ్చాయి.

● భూ సమస్యల పరిష్కారానికి శ్రీకారం: జిల్లా ప్రజలకు చెందిన భూ సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టినట్టు కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. ఒంగోలు మండలం పెళ్లూరు వార్డు సచివాలయంలో గురువారం నిర్వహించిన రెవెన్యూ స్పందన కార్యక్రమాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. వెబ్‌ల్యాండ్‌ వివరాలను సచివాలయాల వద్ద బహిరంగంగా ప్రదర్శిస్తామన్నారు. ప్రజలు సచివాలయాలకు వచ్చి తమ భూమి స్థితిగతిని జాబితాలో పరిశీలించుకునేలా వెసులుబాటు కల్పించనున్నట్టు చెప్పారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోరుకునేవారు జిల్లా కేంద్రానికి రాకుండా సచివాలయాల వద్దనే అర్జీలు ఇవ్వొచ్చన్నారు. ఈ సందర్భంగా కొందరు అర్జీదారులకు సంబంధించి అడంగల్‌, వెబ్‌ల్యాండ్‌ రెవెన్యూ దస్త్రాలను పరిశీలించి పరిష్కారం చూపారు. కలెక్టర్‌ వెంట ఒంగోలు ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి, తహసీల్దార్‌ నయీం అహ్మద్‌, వీఆర్వోలు ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని