అభ్యంతరకర వ్యాఖ్యల పైనే జనాగ్రహం
eenadu telugu news
Published : 22/10/2021 03:12 IST

అభ్యంతరకర వ్యాఖ్యల పైనే జనాగ్రహం

దీక్షల్లో ప్రజాప్రతినిధులు, వైకాపా నాయకులు

ఒంగోలు: దీక్షా శిబిరంలో మంత్రి బాలినేని, జడ్పీ ఛైర్‌పర్సన్‌ వెంకాయమ్మ,

ఎమ్మెల్యే అన్నా, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి, నాయకులు

ఈనాడు డిజిటల్‌ ఒంగోలు, ఒంగోలు నేరవిభాగం- న్యూస్‌టుడే: తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందునే తెదేపా కార్యాలయాలపై దాడులు చోటుచేసుకున్నాయని వైకాపా నాయకులు పేర్కొన్నారు. జిల్లాలోని ఒంగోలు, పర్చూరు, చీరాల, అద్దంకి, కనిగిరి, మార్కాపురం తదితర ప్రాంతాల్లో అధికార పార్టీ ఆధ్వర్యంలో గురువారం జనాగ్రహం దీక్షలు చేశారు. ఈ సందర్భంగా తెదేపా నాయకులపై విమర్శలు గుప్పించారు. ఒంగోలు కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన దీక్షలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, మేయర్‌ గంగాడ సుజాత, పార్టీ నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, అయినాబత్తిన ఘనశ్యాం, కాకుమాను రాజశేఖర్‌, సింగరాజు వెంకటరావు పాల్గొన్నారు. మార్కాపురంలో ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి, అద్దంకిలో శాప్‌ నెట్‌ ఛైర్మన్‌ బాచిన కృష్ణచైతన్య, దర్శిలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ హాజరయ్యారు. చీరాలలో వైకాపా నాయకుడు కరణం వెంకటేష్‌, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వరికూటి అమృతపాణి, మాజీ మంత్రి పాలేటి రామారావు తదితరులు పాల్గొన్నారు. పర్చూరులో వైకాపా నియోజకవర్గ బాధ్యుడు రావి రామనాథంబాబు పాల్గొని నిరసన తెలిపారు. కనిగిరిలో వైకాపా నాయకులు తెదేపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని