ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరుకు సంఘీభావం
eenadu telugu news
Published : 22/10/2021 03:12 IST

ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరుకు సంఘీభావం

సంఘీభావం తెలుపుతున్న స్వామి, ఏలూరి,

సత్య, కందుల, గొట్టిపాటి, ముత్తుముల తదితరులు

మార్టూరు, న్యూస్‌టుడే: తెదేపా కేంద్ర కార్యాలయంలో పగిలిన ఒక్కో అద్దం... వైకాపా ప్రభుత్వ పతనానికి నాంది పలకనున్నాయని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. మంగళగిరిలోని తెదేపా జాతీయ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ దీక్షా శిబిరంలో ఏలూరి గురువారం పాల్గొని మాట్లాడారు. నలుగురు రౌడీలొచ్చి బెదిరిస్తే భయపడే వారెవరూ లేరన్నారు. పార్టీ కార్యాలయంపై చోటుచేసుకున్న దాడితో 70 లక్షల మంది తెదేపా కార్యకర్తల గుండె రగిలిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా... రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. వైకాపా పాలనలో దాడులు, దౌర్జన్యాలు తప్ఫ.. అభివృద్ధి చేసిందేమీ లేదని, పాలనపై అసంతృప్తి పెరగడంతో దృష్టి మళ్లించేందుకే దాడులు చేస్తున్నారని విమర్శించారు.

తరలి వెళ్లిన తెదేపా శ్రేణులు...: తెదేపా అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్షకు సంఘీభావంగా జిల్లా నుంచి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. పర్చూరు, కొండపి, అద్దంకి ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్‌ దీక్షా శిబిరానికి హాజరయ్యారు. గిద్దలూరు, కందుకూరు, మార్కాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, దివి శివరామ్‌, కందుల నారాయణ రెడ్డి, యర్రగొండపాలెం నియోజకవర్గ బాధ్యుడు ఎరిక్షన్‌బాబు నేతృత్వంలో శ్రేణులు తరలి వెళ్లాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని