బీటీఏ ఆధ్వర్యంలో బహుజన బడిబాట
eenadu telugu news
Published : 22/10/2021 03:12 IST

బీటీఏ ఆధ్వర్యంలో బహుజన బడిబాట

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: బడి ఈడు పిల్లలందరూ పాఠశాలలో ఉండాలనే సంకల్పం కరోనా వల్ల భయంతో అమలు కావడం లేదని బహుజన టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్రె వెంకట్రావు అన్నారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పిల్లలందరూ బడికి వచ్చేలా చేయడం కోసం తమ సంఘం ఆధ్వర్యంలో బహుజన బడి బాట కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు. ఒంగోలులోని అంబేడ్కర్‌ భవన్‌లో డి.శ్రీనివాసులు అధ్యక్షతన గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా వల్ల విద్యార్థులు దీర్ఘకాలం పాఠశాలకు దూరమయ్యారన్నారు. ఇప్పుడు తెరిచినా రావడానికి భయపడుతున్నారన్నారు. ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో డ్రాప్‌అవుట్స్‌ పెరుగుతున్నాయని.. బీటీఏ సభ్యులు ఆయా మండలాల్లో బడిబయట పిల్లలను గుర్తించి ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పించాలని కోరారు. సమావేశంలో ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు చిన వెంగయ్య, కోశాధికారి ఆంటోని, రాష్ట్ర కార్యదర్శి శరత్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి సువర్ణబాబు, జాల రామయ్య, మనోహర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని