ఎస్బీఐ మేనేజర్‌ ఆత్మహత్యాయత్నం
eenadu telugu news
Published : 22/10/2021 03:12 IST

ఎస్బీఐ మేనేజర్‌ ఆత్మహత్యాయత్నం

అపస్మారక స్థితిలో ఉన్న కిషోర్‌ను తరలిస్తున్న బ్యాంకు సిబ్బంది

వలేటివారిపాలెం, న్యూస్‌టుడే: వలేటివారిపాలెం భారతీయ స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా బ్రాంచి మేనేజర్‌ కొండవీటి కిషోర్‌ ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డారు. సిబ్బంది తెలిపిని వివరాల ప్రకారం.. గురువారం ఉదయం విధులకు వచ్చిన కొద్దిసేపటికే ఆయన.. అద్దెకు తీసుకున్న తన గదికి వెళ్లారు. సాయంత్రం వరకు తిరిగి విధులకు రాక పోవడంతో బ్యాంకు సిబ్బంది గది వద్దకు వెళ్లి పిలిచినా సమాధానం రాకపోవడంతో తలుపులు తెరిచి చూశారు. అప్పటికే కత్తితో గొంతు, చేతులు, పొట్ట భాగంలో కోసుకుని రక్తస్రావం అయి అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే 108లో కందుకూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తీసుకెళ్లారు. కిషోర్‌ కుటుంబం ఒంగోలులో నివాసం ఉంటోంది. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని