లారీని ఢీకొని యువకుడి దుర్మరణం
eenadu telugu news
Published : 22/10/2021 03:12 IST

లారీని ఢీకొని యువకుడి దుర్మరణం

లారీ కిందికి దూసుకెళ్లిన ద్విచక్ర వాహనం

పేర్నమిట్ట(సంతనూతలపాడు), న్యూస్‌టుడే: పేర్నమిట్టలోని రెడ్డిపాలెం క్రాసింగ్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. చీమకుర్తి మండలం గోనుగుంటకు చెందిన వెంకట్రావు(31) పని మీద ఒంగోలు వెళుతున్నారు. రెడ్డిపాలెం వద్ద చీమకుర్తికి చెందిన లారీ ఒంగోలు వైపు మలుపు తిరుగుతుండగా ద్విచక్ర వాహనంతో బలంగా ఢీకొట్టాడు. దీంతో ద్విచక్ర వాహనం లారీ ముందుభాగంలో ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకట్రావును ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. దీనిపై ఒంగోలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని