టిక్‌టాక్‌ టోనీ ఆత్మహత్య
logo
Updated : 11/04/2021 10:44 IST

టిక్‌టాక్‌ టోనీ ఆత్మహత్య


టోని (పాతచిత్రం)

కె.నగరపాలెం (గ్రామీణభీమిలి), న్యూస్‌టుడే: టిక్‌టాక్‌తో గుర్తింపు తెచ్చుకొన్న ఓ యువకుడు స్టేటస్‌లో తన జీవిత చివరి మాటలు పెట్టి ఈ లోకం నుంచి వెళ్లిపోయాడు. టిక్‌టాక్‌ టోనీగా అందరికి పరిచయమున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం స్థానికులను విషాదంలో నింపింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమిలి బీచ్‌రోడ్డు మంగమారిపేటకి చెందిన గరికిన తాతారావు అలియాస్‌ టోని(25) టిక్‌టాక్‌ వీడియోలు చేస్తుండటంతో అందరూ టిక్‌టాక్‌ టోనీగా పిలుస్తుంటారు. నగరంలోని ఓ బిర్యానీ పాయింట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ చర్యకు ముందు వాట్సాప్‌ స్టేటస్‌లో తన వైవాహిక జీవితం గురించి.. అందులో తాను విసిగిపోయినట్లు భార్యను ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యానాలు చేశాడు. ఈ జీవితాన్ని ముగిస్తున్నానని.. తల్లిదండ్రులు క్షమించాలంటూ పేర్కొన్నాడు. శనివారం ఉదయం ఫ్యానుకు వేలాడుతున్న అతని శవాన్ని చూసి కుటుంబ సభ్యులు హతాశులయ్యారు. టోనీకి పలాస ప్రాంతంలోని మరువాడ గ్రామానికి చెందిన ఓ యువతితో నాలుగు నెలల కిందట వివాహమైంది. ప్రస్తుతం ఆమె గర్భవతి. భార్యాభర్తల మధ్య మనస్పర్థలే తన కుమారుని ఆత్మహత్యకు కారణమని మృతుని తల్లి పోలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని