Updated : 05/05/2021 05:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హైదరాబాద్‌లో జిల్లావాసి ఆత్మహత్య


రమణమూర్తి

దుండిగల్‌, న్యూస్‌టుడే: కుటుంబ కలహాల నేపథ్యంలో జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వంగర మండలం గీతనాపల్లి గ్రామానికి చెందిన కె.రమణమూర్తి(38), శారద దంపతులు. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌ నగరానికి వలస వెళ్లి... అక్కడ సూరారంలోని పాండు బస్తీలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. గత 7 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రమణమూర్తి తరచూ మద్యం తాగుతుండడంతో దంపతుల మధ్య కలహాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే ఇటీవల తన సోదరుడి ఇంటికి ఆమె ఇద్దరు కుమారులను తీసుకొని వెళ్లింది. అయితే రమణమూర్తి విధులకు హాజరవడం లేదని సహచర కానిస్టేబుల్‌ కృష్ణ ఈ నెల 1న ఆమెకు ఫోన్‌ చేశాడు. దీంతో ఆమె తన బంధువులకు ఈ విషయం తెలపడంతో వారు అదే రోజు ఇంటికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని