ఉపాధ్యాయులకు టీకా వేయాలని డిమాండు
logo
Published : 17/05/2021 04:57 IST

ఉపాధ్యాయులకు టీకా వేయాలని డిమాండు

శ్రీకాకుళం విద్యావిభాగం, ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయులను ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా గుర్తించి, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి టీకా వేయాలని వైఎస్‌ఆర్‌ టీచర్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎం.చిన్నబాబు, టి.చందనరావు, రాష్ట్ర కార్యదర్శి కె.తేజేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో డిమాండు చేశారు.

అప్పుడే పాఠశాలలు తెరవొద్దు : కరోనా ప్రభావం తగ్గే వరకు పాఠశాలలు తెరవొద్దని ఫోరం ఆఫ్‌ రిజిస్టర్డ్‌ టీచర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఓఆర్‌టీవో) సంఘ రాష్ట్ర సమావేశం ప్రభుత్వాన్ని కోరింది. ఆదివారం రాష్ట్ర స్థాయి సమావేశం గూగుల్‌ మీట్‌ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సంఘ నేతలు మాట్లాడుతూ విద్యాకానుక, డ్రైరేషన్‌, నాడు-నేడు పనులు వాయిదా వేయాలని డిమాండు చేశారు. ఈహెచ్‌ఎస్‌ నగదు రహిత వైద్యం పక్కాగా అమలు చేయాలని, 50 శాతం పడకలు ఉద్యోగులకు కేటాయించాలన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్రరావు మృతిపట్ల సమావేశంలో సంతాపం ప్రకటించారు. కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు ధనంజయరావు, ఎస్‌.శ్రీనివాసరావు, జి.శివానందరెడ్డి, ఎం.శ్రీనివాసరావు, శివశంకరరెడ్డి, గిరిజాపతి, తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని