కొవిడ్‌ ఆసుపత్రులకు ఆక్సిజన్‌ సరఫరా
logo
Published : 17/05/2021 05:17 IST

కొవిడ్‌ ఆసుపత్రులకు ఆక్సిజన్‌ సరఫరా


ఆక్సిజన్‌ ప్లాంట్‌ను పరిశీలిస్తున్న ఆర్డీవో కిశోర్‌, తదితరులు

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: కొవిడ్‌ బాధితులకు చికిత్స అందిస్తోన్న ఆసుపత్రులకు ఆక్సిజన్‌ సరఫరా చేసేందుకు చర్యలు చేపడుతున్నామని ఆర్డీవో ఐ.కిశోర్‌ అన్నారు. ఎచ్చెర్ల మండలంలోని కుశాలపురం పంచాయతీ పరిధిలోని పారిశ్రామిక వాడలో ఉన్న ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్‌ను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో గుర్తించిన కొన్ని ఆసుపత్రులకు ఇక్కడి నుంచి ఆక్సిజన్‌ను సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎచ్చెర్ల మండలంలో జరుగుతున్న ఫీవర్‌ సర్వే వివరాలను తహసీల్దార్‌ సనపల సుధాసాగర్‌ను అడిగి తెలుసుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని