అసత్య ప్రచారాలు చేసిన వారికి నోటీసులు
logo
Published : 17/05/2021 05:22 IST

అసత్య ప్రచారాలు చేసిన వారికి నోటీసులు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: సామాజిక మాధ్యమంల్లో అసత్యప్రచారాలు చేసిన పలాస పురపాలక సంఘం కాశీబుగ్గకు చెందిన పి.జయలక్ష్మికి లీగల్‌ నోటీసులు జారీ చేసినట్లు రాగోలులోని జెమ్స్‌ ఆసుపత్రి ఆర్‌ఎంవో డాక్టర్‌ డి.ప్రవీణ్‌కుమార్‌ ప్రకటనలో తెలిపారు. ఎన్‌.చిన్నమ్మడు కరోనా బారిన పడి మే 2న జెమ్స్‌ ఆసుపత్రిలో చేరారని, ఆమెకు మెరుగైన వైద్యం అందించినప్పటికీ మృతిచెందినట్లు పేర్కొన్నారు. అనంతరం మృతదేహాన్ని రెవెన్యూ సిబ్బంది ద్వారా ఆమె కుమార్తె జయలక్ష్మికి అప్పగించినట్లు చెప్పారు. తరువాత ఆమె ఆసుపత్రిపై బురదజల్లాలనే ఉద్దేశంతో ఓ అసత్యపు వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసి ప్రజలు, రోగులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. దీనిపై జెమ్స్‌ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తీవ్ర ఆవేదనకు గురయ్యారన్నారు. ఆమెకు లీగల్‌ నోటీసులు పంపామని, వారంలోపు వివరణ ఇవ్వకుంటే పరువు నష్టం దావా వేస్తామన్నారు. జెమ్స్‌ కొవిడ్‌ ఆసుపత్రి అయినందున రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారుల నియంత్రణలో ఉందని, శాఖాపరమైన చర్యలకుగాను కలెక్టర్‌ జె.నివాస్‌కు కూడా తెలియజేశాయమని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని