12 శాతం వేతనాల పెంపునకు ఆమోదం
logo
Published : 17/05/2021 05:22 IST

12 శాతం వేతనాల పెంపునకు ఆమోదం

మాట్లాడుతున్న కార్మికసంఘం కార్యదర్శి తాతయ్య

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: జీడి కార్మికులకు 12శాతం వేతనాల పెంపునకు ఆమోదం లభించింది. ప్రతి రెండేళ్లకొకసారి వేతనాల ఒప్పంద ప్రక్రియ జరుగుతుంది. 2019లో జరిగిన ఒప్పందం ఈ ఏడాది మే 16తో ముగిసింది. దీంతో కొత్త వేతనాల ప్రక్రియకు సంబంధించి ఈనెల 14న ఇరువర్గాల మధ్య చర్చలు నిర్వహించారు. అవి ఫలించకపోవడంతో మంత్రి డా.సీదిరి అప్పలరాజును కార్మికసంఘం నాయకులు కలిసి సమస్య పరిష్కారానికి విన్నవించారు. ఈనేపథ్యంలో 2021-2023కు సంబంధించి కొత్త వేతనాలకు జీడి వ్యాపారులు, కార్మికుల మధ్య పలాసలో ఆదివారం జరిగిన చర్చల్లో ప్రస్తుతం ఉన్న వేతనాల్లో 12 శాతం పెంచేందుకు అంగీకారం కుదిరింది. అంగీకారం కుదరనిపక్షంలో సోమవారం నుంచి జీడి కర్మాగారాలు బంద్‌ చేయాలని కార్మికులు నిర్ణయించారు. ఈమేరకు ఇరువర్గాల మధ్య చర్చలు ఫలించడంతో పనులు యథావిధిగా కొనసాగనున్నాయి. వ్యవసాయ మార్కెట్‌కమిటీ అధ్యక్షుడు పి.వి.సతీష్‌, వ్యాపారసంఘం అధ్యక్ష, కార్యదర్శులు మల్లా సురేష్‌కుమార్‌, కె.వి.శివకృష్ణ, కోశాధికారి రవికాంత్‌, కార్మికసంఘం అధ్యక్ష, కార్యదర్శులు సింహాచలం, తాతయ్యలతో పాటు భీమారావు, ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని