గృహనిర్మాణ జేసీగా బాధ్యతల స్వీకరణ
eenadu telugu news
Published : 14/06/2021 04:00 IST

గృహనిర్మాణ జేసీగా బాధ్యతల స్వీకరణ

హిమాంశు కౌశికకు పుష్పగుచ్ఛం అందిస్తున్న పీడీ వేణుగోపాల్‌

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: గృహనిర్మాణం జేసీగా హిమాంశు కౌశిక్‌ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన 2018 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. పశ్చిమగోదావరి జిల్లాలో సహాయ కలెక్టర్‌గా శిక్షణ పొందారు. అమలాపురం సబ్‌ కలెక్టర్‌గా విధులు నిర్వహించి బదిలీపై జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వివిధ పథకాల కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాలతో సహా జగనన్న కాలనీల్లో నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఆయనకు ఆ శాఖ పీడీ వేణుగోపాల్‌, ఇతర అధికారులు స్వాగతం పలికారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని