సమష్టి కృషితోనే గృహనిర్మాణాలు పూర్తి
eenadu telugu news
Published : 15/06/2021 06:13 IST

సమష్టి కృషితోనే గృహనిర్మాణాలు పూర్తి

మాట్లాడుతున్న ఎండీ నారాయణభరత్‌ గుప్తా, చిత్రంలో ఇతర అధికారులు

శ్రీకాకుళం అర్బన్‌/నగరం/ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: జగనన్న లేఅవుట్లలో లబ్ధిదారులకు కేటాయించిన స్థలాల్లో గృహనిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నారాయణ్‌భరత్‌గుప్త ఆదేశించారు. సోమవారం జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 741 లేఅవుట్లు ఉన్నాయని, వాటిని వచ్చే ఏడాది మార్చినెల నాటికి అన్ని హంగులతో పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయాలన్నారు. అవసరమైన సామగ్రి, ఇతరత్రా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ టౌన్‌షిప్‌, మౌలిక వసతుల కల్పన ఓఎస్‌డీ ఎం.ప్రసాదరావు మాట్లాడుతూ జిల్లాలో తొలి విడతలో 658 లేఅవుట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. 1500 కంటే ఎక్కువ ఇళ్లు ఉన్నచోట అండర్‌ డ్రైనేజీ, తక్కువ ఉన్నచోట ఓపెన్‌ డ్రైనేజీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 500 కంటే ఎక్కువ ఇళ్లు ఉన్నచోట అండర్‌గ్రౌండ్‌ ఎలక్ట్రికల్‌, తక్కువ ఉన్నచోట ఓవర్‌హెడ్‌ ఎలక్ట్రికల్‌ సిస్టంను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. వీటితో పాటు ఫైబర్‌నెట్‌, పార్కులు, ఇతరత్రా వసతులు సమకూర్చనున్నట్లు వివరించారు. రోజువారీ ప్రగతిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. అనంతరం ఎండీ నారాయణభరత్‌ శ్రీకాకుళం నగరంలోని కంపోస్టు కాలనీ వార్డు సచివాలయాన్ని సందర్శించారు. లబ్ధిదారుల వివరాలను సక్రమంగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. గృహనిర్మాణశ జేసీ హిమాంశు కౌశిక్‌, పీడీ వేణుగోపాల్‌, చీఫ్‌ ఇంజినీర్‌ పి.శ్రీరాములు, ఈఈలు, డీఈలు పాల్గొన్నారు. ● ఎచ్చెర్ల మండలం కుప్పిలిలో నిర్మిస్తున్న ఇళ్లను గృహనిర్మాణశాఖ ఓఎస్‌డీ ఎం.ప్రసాద్‌ పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్‌ సుధాసాగర్‌, గృహనిర్మాణశాఖ డీఈ రామ్మూర్తి పాల్గొన్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని