మహిళ కడుపులో 10 కిలోల కణితి
logo
Updated : 21/06/2021 05:25 IST

మహిళ కడుపులో 10 కిలోల కణితి

తొలగించి ప్రాణాలు కాపాడిన వైద్యుడు


కోలుకున్న మోహినమ్మ

సోంపేట, న్యూస్‌టుడే: కడుపులో 10 కిలోల కణితితో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ నిరుపేద మహిళకు సోంపేట వైద్యుడు డాక్టర్‌ రమేష్‌కుమార్‌ ఉచితంగా శస్త్రచికిత్స చేసి ఆమె ప్రాణాలు కాపాడారు. కడుపు నొప్పితో ఆసుపత్రికి వచ్చిన మహిళ కడుపులో కణితి ఉందని తెలుసుకొని ఆదివారం మత్తువైద్యుడు సాగర్‌ సహకారంతో శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. సరిహద్దు గ్రామం జట్టిభద్రకు చెందిన 42 ఏళ్ల అవివాహిత జె.మోహినమ్మ అయిదేళ్లుగా కడుపునొప్పితో బాధ పడుతున్నారు. రోజువారీ కూలిపనులకు వెళ్తే తప్ప పూట గడవని పరిస్థితి ఆమెది. దీంతో ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోలేదు. వారం రోజులుగా పరిస్థితి మరింతగా విషమించడంతో స్థానికుల సహకారంతో సోంపేటలోని పైడిశెట్టి శ్యామలానర్సింగ్‌హోం ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. వెంటనే శస్త్రచికిత్స చేయాలని కోరడంతో మహిళ ఆర్థిక పరిస్థితిని స్థానికులు వైద్యుడికి తెలిపారు. దీంతో ఉచితంగా ఆపరేషన్‌ చేయడంతో పాటు హృదయం ఫౌండేషన్‌, వాసవీసేవాదళ్‌ సభ్యులను సంప్రదించి రక్తం సమకూర్చి కడుపులోని 10 కిలోల కణితిని తొలగించారు. వైద్యులతో పాటు సకాలంలో రక్తం సమకూర్చిన యువతకు స్థానిక ప్రముఖులు అభినందించారు. మోహినమ్మ ఆరోగ్యం బాగానే ఉందని క్రమంగా కోలుకుంటారని డాక్టర్‌ రమేష్‌కుమార్‌ తెలిపారు.


బయటకు తీసిన కణితి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని