మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
logo
Published : 21/06/2021 05:21 IST

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య


కామేశ్వరరావు (దాచిన చిత్రం)

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే: ‘రోజు తాగి వస్తావు... అప్పులు ఉన్నా పట్టించుకోవు. కుటుంబం, పిల్లల బాధ్యతలు చూడకుండా తిరుగుతున్నావు’ అని భార్య నీలదీసింది. దీంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వజ్రపుకొత్తూరు మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చినవంకకు చెందిన మల్లా కామేశ్వరరావు(50) రెండేళ్లుగా అప్పులు చేస్తూ..విపరీతంగా మద్యం తాగుతూ తిరుగుతుండేవాడు. శనివారం కూడా తాగి ఇంటికి వచ్చిన ఆయనను భార్య నిలదీసింది. వెంటనే ఆయన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వీఆర్వో వసంతరాజు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ కూన గోవిందరావు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని, ఇంటి పరిసరాలు పరిశీలించి కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పలాస సామాజిక ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించినట్లు ఎస్‌ఐ చెప్పారు. కామేశ్వరరావుకి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని