ఆర్థిక ఇబ్బందులు తాళలేక బలవన్మరణం
eenadu telugu news
Published : 24/07/2021 04:26 IST

ఆర్థిక ఇబ్బందులు తాళలేక బలవన్మరణం

రత్నాకర్‌ (దాచిన చిత్రం)

శ్రీకాకుళం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులు తాళలేక వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీకాకుళం నగరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎల్‌ఎన్‌పేటకు చెందిన రత్నాకర్‌ పాణిగ్రాహి(42) భవన నిర్మాణ పనులను చేస్తుంటారు. ప్రస్తుతం భార్య కవిత, ఇద్దరు పిల్లలతో కలిసి వాంబేకాలనీలో నివాసం ఉంటున్నారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 12వ తేదీన భార్య తన కన్నవారింటికి కొరసవాడ వెళ్లింది. 17న రత్నాకర్‌ కూడా వెళ్లారు. అదేరోజు రాత్రి ఇంటికి తిరిగి వచ్చేశాడు. 18వ తేదీ నుంచి తలుపులు మూసే ఉన్నాయి. శుక్రవారం దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన పక్కింట్లో ఉంటున్న సోదరుడు తలుపులను గట్టిగా కొట్టాడు. ఎంతకీ తీయకపోవడంతో కిటీకీ తలుపులు తెరచి చూశాడు. ఆయన ఉరేసుకొని ఉన్నట్లు గమనించి ఒకటో పట్టణ పోలీసులకు విషయం తెలియజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని