కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం
eenadu telugu news
Published : 27/07/2021 03:05 IST

కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం

సమావేశంలో పాల్గొన్న వివిధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు

పాతశ్రీకాకుళం, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే అందరి లక్ష్యం కావాలని ఆ పార్టీ బీసీ, ఎస్సీ, మైనారిటీ విభాగాల అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వరరావు, కె.వినయ్‌కుమార్‌, డి.గాంధీ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన వీరు శ్రీకాకుళం నగరంలోని విజ్ఞాన్‌ భవన్‌లో పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి పార్టీని పూర్తిస్థాయిలో సన్నద్దం చేయాలని రాష్ట్ర, జాతీయ నాయకులు లక్ష్యంగా నిర్దేశించారని, ఆ దిశగా అందరి ప్రయత్నాలు జరుగుతుండాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వనరులను, ప్రజల ఆదాయాన్ని దోచుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా వారి మద్దతు సాధించవచ్చని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి జి.వి.నారాయణరావు, శాంతకుమారి, జిల్లా ఇంచార్జి జి.ఎ.నారాయణరావు మాట్లాడుతూ ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు డీసీసీ నాయకులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని