రహదారి విస్తరణకు ఏర్పాట్లు
eenadu telugu news
Published : 27/07/2021 03:08 IST

రహదారి విస్తరణకు ఏర్పాట్లు

ఉర్లాం ప్రధాన వీధిలో కొలతలు వేస్తున్న సిబ్బంది

నరసన్నపేట గ్రామీణం, న్యూస్‌టుడే : కోమర్తి-బద్రి రహదారి విస్తరణకు రహదారులు-భవనాలు శాఖ అధికారులు చర్యలు చేపట్టడంతో ఉర్లాం ప్రధాన వీధి, మార్కెట్‌ కూడలి వాసులు ఆందోళనకు గురవుతున్నారు. రహదారి మధ్య నుంచి రెండు వైపులా 25 అడుగులకు కొలతలు వేసిన అధికారులు సూచికలు ఏర్పాటు చేస్తుండటంతో ఇళ్లు తొలగించాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు. ఈ విషయమై ఏఈ రాజశేఖర్‌ మాట్లాడుతూ 23 కిలోమీటర్ల మేర రూ.25కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని ప్రజలు సహకరించాలని కోరారు. రహదారిని రెండు వైపులా 25 అడుగుల మేర విస్తరిస్తామని, ఉన్న అడ్డంకులు తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, దీంతో ట్రాపిక్‌ సమస్యలు పూర్తిగా తొలగుతాయని ఆయన తెలిపారు. ఉర్లాం, యారబాడు, కోమర్తి గ్రామాల్లో సిమెంట్‌ రహదారి, కాలువలు నిర్మాణం చేపడతామని, ప్రజలు సహకరించాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని