పురుగుల మందు తాగి...వివాహిత ఆత్మహత్య
eenadu telugu news
Updated : 27/07/2021 06:30 IST

పురుగుల మందు తాగి...వివాహిత ఆత్మహత్య

సంధ్య(దాచిన చిత్రం)

సారవకోట, న్యూస్‌టుడే : ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె జీవితం కొన్నాళ్లపాటు సజావుగా సాగింది. వారి ప్రేమ ఫలంగా బాబు పుట్టాడు. ఆనందంగా సాగుతున్న వారి జీవనాన్ని చూసి విధికి కన్నుకుట్టిందో ఏమో..కట్నం కోసం వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె తట్టుకోలేక పోయింది. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ ఎం.ముకుందరావు తెలిపిన వివరాల మేరకు....  అన్నుపురం పంచాయతీ వాబ గ్రామానికి చెందిన లుకలాపు గౌరీశంకర్‌, చిన్నగుజ్జువాడ గ్రామానికి చెందిన సంధ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఏడాదిన్నర వయస్సుగల కుమారుడు ఉన్నాడు. కులాంతర వివాహం చేసుకున్న వీరి కాపురంలో వరకట్నం వేదింపులు చోటుచేసుకోవడంతో జీవితం విరక్తి చెందిన సంధ్య (19) ఈ నెల 21న పురుగుల మందు తాగింది. భర్త ఆమెను వెంటనే శ్రీకాకుళంలోని కిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆమె సోమవారం మృతిచెందింది. కుటుంబసభ్యులు వేధించడంతో ఇటీవల రూ.60వేలు నగదు, సారే సామాన్లు ఇచ్చానని, అయినా వేధింపులు ఆగలేదని, తన కుమార్తె మరణానికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంధ్య తండ్రి పులిబందల నర్సయ్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపులు, అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని పాలకొండ డీఎస్పీ ఎం.శ్రావణి తెలిపారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని