Published : 27/07/2021 03:25 IST

శిరస్త్రాణ ధారణ.. ప్రాణానికి రక్షణ

శిరస్త్రాణం ఆవశ్యకతను వివరిస్తూ ట్రాఫిక్‌ పోలీసులు సోమవారం శ్రీకాకుళం నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. వాహనదారులు నాణ్యమైన శిరస్త్రాణం మాత్రమే ధరించాలని, వాహనానికి సంబంధించిన ఇతర ధ్రువపత్రాలు దగ్గర ఉంచుకోవాలని నినాదాలు చేశారు. డే అండ్‌ నైట్‌ కూడలి వద్ద ప్రారంభమైన ర్యాలీ పొట్టిశ్రీరాములు, సూర్యమహల్‌, రామలక్ష్మణ కూడళ్ల మీదుగా సాగింది. ట్రాఫిక్‌ డీఎస్పీ ప్రసాదరావు, ఇతర పోలీసు సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, శ్రీకాకుళం నేరవార్తా విభాగం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని