ఒప్పంద ఉద్యోగుల నిరసన గళం
eenadu telugu news
Published : 27/07/2021 03:29 IST

ఒప్పంద ఉద్యోగుల నిరసన గళం

శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ జిల్లా వైద్యఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఒప్పంద పారామెడికల్‌ సిబ్బంది డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట సోమవారం ధర్నాకు దిగారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్షుడు ఆర్‌.సురేష్‌బాబు, ఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉపాధ్యక్షుడు చౌదరి పురుషోత్తంనాయుడు, జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం, ఏపీ ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల సమాఖ్య కన్వీనర్‌ డబ్బీరు సాయిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో అంతా నిరసన వ్యక్తం చేశారు.

- న్యూస్‌టుడే, గుజరాతీపేట(శ్రీకాకుళం)


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని