విజిలెన్స్‌ దాడులు
eenadu telugu news
Updated : 27/07/2021 04:49 IST

విజిలెన్స్‌ దాడులు

అనుమతి లేకుండానే అమ్మకాలు..


మిల్లులో బియ్యాన్ని పరిశీలిస్తున్న అధికారులు

రాజాం గ్రామీణం (సంతకవిటి), న్యూస్‌టుడే: సంతకవిటి మండలంలో అయిదు రైస్‌ మిల్లులపై విజిలెన్స్‌ అధికారులు, పౌర సరఫరాల అధికారులు సోమవారం దాడులు చేశారు. విజిలెన్స్‌ సీఐ అప్పలనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడుల్లో మండల కేంద్రంలోని సీతారత్నం రైస్‌ మిల్లులో రూ.7.90 లక్షల విలువైన చౌక దుకాణాల ద్వారా పేదలకు అందించే బియ్యాన్ని గుర్తించి పట్టుకున్నారు. ఈ సందర్భంగా పలు దస్త్రాలను పరిశీలించారు. అనంతరం పట్టుకున్న బియ్యాన్ని సీజ్‌ చేశారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. డివిజనల్‌ పౌర సరఫరాలశాఖ అధికారి పంతులు, సీఎస్‌డీటీ రంజిత్‌, వీఆర్‌వో మౌలి తదితరులు పాల్గొన్నారు.


పేదల బియ్యం పక్కదారి..

ఎరువుల బస్తాలను తనిఖీ చేస్తున్న ఎస్‌ఐ అశోక్‌చక్రవర్తి, సిబ్బంది

భామిని గ్రామీణం, న్యూస్‌టుడే: భామిని మండలం గురండిలో అనుమతి లేకుండా నిల్వ ఉంచి విక్రయాలు చేస్తున్న ఎరువుల బస్తాలను సీజ్‌ చేసినట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ ఎస్‌ఐ అశోక్‌ చక్రవర్తి తెలిపారు. తమ శాఖ ఎస్పీ వరదరాజులు ఆదేశాల మేరకు దాడులు జరిపామన్నారు. మొత్తం 233 ఎరువుల బస్తాలను సీజ్‌ చేసి భామిని మండల వ్యవసాయాధికారి తిలక్‌కు అప్పగించామని, వీటి విలువ సుమారు రూ.2.26 లక్షలు ఉంటుందని వివరించారు. ఈ విషయంలో మన్మధరావు అనే వ్యక్తిపై కేసు నమోదు చేశామన్నారు. వ్యవసాయాధికారి తిలక్‌, వీఆర్వో సన్యాసిరావు తదితరులున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని