30న రెండో ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక
eenadu telugu news
Published : 27/07/2021 03:38 IST

30న రెండో ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే : ఇటీవల పుర పాలకమండలి ఎన్నికలు జరిగిన జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలతో పాటు, పాలకొండ నగర పంచాయతీలో రెండో ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 30న ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఎన్నికలు జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషనరు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ మూడుచోట్ల ఎన్నికల అధికారులను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులను ఇచ్చారు. ఇచ్ఛాపురంలో ఎన్నికల అధికారిగా టెక్కలి సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మర్మత్‌, పలాస-కాశీబుగ్గలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ టి.సీతారామ్మూర్తి, పాలకొండ నగర పంచాయతీలో ఆర్డీవో టీవీఎస్‌జీ కుమార్‌లను నియమించారు. ఆ రోజు ఎన్నికలు జరగకుంటే తరువాత పని దినంలో ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని