పచ్చదనంతో పర్యావరణ పరిరక్షణ
eenadu telugu news
Published : 27/07/2021 03:51 IST

పచ్చదనంతో పర్యావరణ పరిరక్షణ


టెక్కలిలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌

టెక్కలి పట్టణం, నందిగాం, న్యూస్‌టుడే : పచ్చదనంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుందని శాసనమండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా పెద్దభీంపురం మార్గంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా సీతాపురం నుంచి ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం టెక్కలిలోని ఆదిత్య కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన నియోజకవర్గస్థాయి సమావేశం ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ పూర్తిచేసి నందిగాం మండల రైతులకు పూర్తిస్తాయిలో సాగునీరు అందించేందుకు కృషిచేస్తామన్నారు. వంశధార కాలువ నుంచి సాగునీరు అందించేందుకు రూ.9 కోట్లతో అదనపు కాలువ నిర్మాణానికి ఆలోచన చేస్తున్నామన్నారు. డ్వామా పీడీ కూర్మారావు, ఉద్యానవనశాఖ సహాయ సంచాలకుడు ప్రసాదరావు, తహసీల్దార్‌ బి.నాగభూషణరావు పాల్గొన్నారు. నందిగాం జడ్పీ ఉన్నతపాఠశాల ఆవరణలో ప్రహరీ పక్కన జడ్పీటీసీ మాజీసభ్యుడు బాలకృష్ణ మొక్కలు నాటారు. పెద్దతామరాపల్లి ప్రాథమిక పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయుడు శంకరరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మొక్కలు నాటారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని