కార్గిల్‌ అమరవీరులకు నివాళి
eenadu telugu news
Published : 27/07/2021 03:55 IST

కార్గిల్‌ అమరవీరులకు నివాళి

కొత్తూరులో ప్రదర్శన నిర్వహిస్తున్న యువకులు

కొత్తూరు, న్యూస్‌టుడే: కార్గిల్‌ అమర వీరులకు ఘన నివాళి అర్పించారు. స్థానిక నాలుగు రహదారుల కూడలిలో బీజేవైఎం జిల్లా కార్యర్శి సారిపల్లి సంతోష్‌ ఆధ్వర్యంలో సోమవారం ప్రదర్శన నిర్వహించారు. 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధంలో విజయం సాధించారు. ఇందులో అమరులైన వారికి కొవ్వొత్తులతో ప్రదర్శన చేసి, నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో యువకులు పాల్గొన్నారు.

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే : కార్గిల్‌ యుద్ధంలో ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగం వెలకట్టలేనిదని భాజపా రాష్ట్ర పొలిటికల్‌ ఫీడ్‌బ్యాక్‌ కమిటీ సభ్యుడు, టెక్కలి నియోజకవర్గ కన్వీనరు హనుమంతు ఉదయ్‌భాస్కర్‌ అన్నారు. కార్గిల్‌ విజయ దివస్‌ను స్థానిక భాజపా కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. భరతమాత చిత్రపటానికి పూలమాల వేశారు.

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: దేశభద్రత, ప్రజలకోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి, కార్గిల్‌ పోరులో అసువులు బాసిన అమరవీరులు మహనీయులని ఇచ్ఛాపురం మాజీ సైనికోద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. సంఘం కార్యాలయం వద్ద సోమవారం కార్గిల్‌ అమరవీరులకు నివాళులర్పించి, కార్గిల్‌ దివస్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు రాజులురెడ్డి, బీఎల్‌నారాయణ, విశ్వనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని