విస్తరణ పనుల్లో తప్పిన ప్రమాదం
eenadu telugu news
Published : 27/07/2021 03:58 IST

విస్తరణ పనుల్లో తప్పిన ప్రమాదం


ఘటనా స్థలం వద్ద విద్యుత్తు తీగలను తొలగిస్తున్న సిబ్బంది

పలాస,న్యూస్‌టుడే: పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలో కె.టి.రోడ్డులో ప్రమాదం తప్పింది. రోడ్డు విస్తరణలో భాగంగా సోమవారం శ్రీనివాసలాడ్జి కూడలి నుంచి భవన, దుకాణాల శిథిలాలు తొలగిస్తున్న సమయంలో పెద్ద కాంక్రీట్‌దిమ్మ ఒక్కసారిగా కిందన ఉండే విద్యుత్తు తీగలపై పడిపోయింది. దీంతో ఇరువైపులా ఉన్న విద్యుత్తు స్థంభాలు విరిగిపోయి తీగలు ఎక్స్‌వేటర్‌ను చుట్టివేశాయి. పనులు జరుగుతున్న సమయంలో విద్యుత్తు సరఫరా నిలిపివేయటం, కాంక్రీట్‌ దిమ్మలు, భవనశిథిఫలాలు యంత్రం ముందుభాగంలో పడటంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. వెంటనే విద్యుత్తు శాఖ లైన్‌మేన్‌ రాజారావు సిబ్బందితో చేరుకొని విద్యుత్తు వైర్లను తొలగించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని