‘మంత్రిని కించపరిచే వ్యాఖ్యలు మానుకోవాలి’
eenadu telugu news
Published : 04/08/2021 03:50 IST

‘మంత్రిని కించపరిచే వ్యాఖ్యలు మానుకోవాలి’


వజ్రపుకొత్తూరులో మాట్లాడుతున్న వైకాపా నాయకులు

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే: సామాన్య కుటుంబం నుంచి వచ్చి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన సీదిరి అప్పలరాజును కించపరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని తెదేపా నాయకురాలు శిరీష మానుకోవాలని, లేదంటే ప్రజలే మళ్లీ బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని వైకాపా జిల్లా నాయకులు పేర్కొన్నారు. వజ్రపుకొత్తూరు వైకాపా కార్యాలయంలో మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ.. తొలుత సామాజిక మాధ్యమాల్లో మంత్రితో పాటు అతని కుటుంబసభ్యులపైనా అసభ్యకర పోస్టులు పెట్టింది తెదేపా నాయకులే అన్నారు. ఆ పార్టీ నాయకులను అదుపులో పెట్టకుండా మళ్లీ పరుషపదజాలంతో మాట్లాడడం ఆడపిల్లగా తగదన్నారు. నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్నారు. గౌతు పేరుతో రాజకీయాలు చేస్తున్నారే తప్ప, ఈ ప్రాంతంలో వారివల్ల అభివృద్ధి ఏమీ జరగలేదని ఆరోపించారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారం చేయడం ఆపాలన్నారు. పీఏసీఎస్‌ అధ్యక్షుడు దువ్వాడ హేమబాబుచౌదరి, ఆ పార్టీ మండలాధ్యక్షుడు గురయ్యనాయుడు, జిల్లా కార్యదర్శులు శ్రీను, రాంప్రసాద్‌, రామలింగం, కరుణాకర్‌, హేమంత్‌, భాస్కరరెడ్డి, గిరి, గీతారాణి, వరదరాజులు ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని